ఆలమూరు-జొన్నాడ ప్రధాన రహదారిలోని శరవణ ఫైబర్స్ కొబ్బరిపీచు ఫ్యాక్టరీలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో దట్టమైన పొగతో రహదారిపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జిల్లా అగ్నిమాపకాధికారి మార్టిన్ లూథర్ కింగ్ పర్యవేక్షణలో మండపేట, కొత్తపేట ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 3 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా.