ఆలమూరు మండలం చింతలూరులోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో రూ. 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న క్యూలైన్, ప్రదక్షిణ మార్గం కాంక్రీట్ పనులకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం భూమిపూజ చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, పాలకమండలి సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.