కట్టుంగలో వడలి & బమిడిపాటి రూరల్ డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, గౌతమి నేత్రాలయం వైద్య సిబ్బంది నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని
వైసీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి శనివారం సందర్శించారు. ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ మద్దూరి సుబ్బారావు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని, కంటి సమస్యలను ముందుగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని జగ్గిరెడ్డి పేర్కొన్నారు. నిర్వాహకులను ఆయన అభినందించారు.