ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి కొత్తపేట వాస్తవ్యులు వెంకట రత్న దీక్షితులు, బాల త్రిపుర సుందరి దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి రూ. 1, 00, 001 విరాళంగా అందజేశారు. గురువారం ఆలయ అధికారులను కలిసి ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో సమర్పించారు. దాతల ఉదారతను ఆలయ కమిటీ వారు అభినందిస్తూ, స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు.