వాడపల్లిలో అన్నదాన భవన నిర్మాణ పనుల పరిశీలన

4చూసినవారు
ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న వకుళామాత అన్నదాన భవన నిర్మాణ పనులను ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, దేవాదాయ శాఖ డి. ఇ. ఇ. ఎన్. ఉదయ్ కుమార్ సోమవారం పరిశీలించారు. భవన నిర్మాణ నాణ్యతను, పురోగతిని వారు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భక్తుల సౌకర్యార్థం ఈ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు, గుత్తేదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్