కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు గదుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, తన గురువు మాజీ ప్రిన్సిపాల్ కంకటాల సత్యనారాయణ పాదాలకు నమస్కరించి నివాళులర్పించారు. గురువులను మరువరాదని, వారి పట్ల విధేయత కలిగి ఉండాలని ఆయన ఈ సందర్భంగా నిరూపించారు. ఎమ్మెల్యే చూపిన ఈ వినమ్రత విద్యార్థులకు, యువతకు ఆదర్శంగా నిలిచింది.