కొత్తపేట: 'ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి'

5చూసినవారు
కొత్తపేట, రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంగళవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఉన్నత విద్యాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. విద్యార్థుల కోరిక మేరకు కొత్తపేట కళాశాలకు రూ. 2 లక్షలతో కంప్యూటర్లు, రావులపాలెం కళాశాలలో సీసీ రోడ్లు, డిజిటల్ క్లాస్ రూమ్ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు.

సంబంధిత పోస్ట్