రైతు ధర్నాపై కొత్తపేట ఎమ్మెల్యే బండారు తక్షణ స్పందన

1చూసినవారు
కొత్తపేటలో వ్యవసాయ కోత యంత్రాలకు డీజిల్ అందక రైతులు చేపట్టిన ధర్నాపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తక్షణమే స్పందించారు. ఆదివారం ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన ఎమ్మార్వోకు ఫోన్ చేసి, తక్షణమే ధర్నా ప్రదేశానికి వెళ్లి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. వరి కోతల సమయంలో ఇంధన కొరత వల్ల పంట పనులు నిలిచిపోకూడదని, మొదటి ప్రాధాన్యతగా రైతులకు డీజిల్ అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగి సరఫరాను క్రమబద్ధీకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే వేగంగా స్పందించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్