కొత్తపేట మండలం బిళ్ళకుర్రు గ్రామంలో అతి పురాతనమైన శ్రీ మహాదేవ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. సుమారు రూ. 1. 10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ నిర్మాణానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం, సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.