కొత్తపేట: 'యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ధ్యేయం'

956చూసినవారు
కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్‌ మేళాను ఆయన ప్రారంభించారు. యువతకు అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, వికసిత భారత్ 2047 లక్ష్యాలతో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ నేతృత్వంలో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్