కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ, కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బుధవారం ఆత్రేయపురం మండలం వాడపల్లి కొత్త వంతెన వద్ద రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న రిటర్నింగ్ వాల్ పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం నూతన బస్టాండ్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, ముళ్ళపూడి భాస్కరరావు, కాయల జగన్నాధం తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.