ధనుర్మాసం, ఆరుద్ర దర్శనం, పౌర్ణమి, శివముక్కోటి మహాపర్వదినం సందర్భంగా ఆలమూరు భట్టీవిక్రమార్కేశ్వరస్వామి ఆలయంలో శనివారం నిర్వహించిన భట్టీశ్వరస్వామి వారి అన్నాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన నవ జనార్ధన స్వామి వారి ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు.