రావులపాలెంలో బుధవారం సాయంత్రం శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదం కారణంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అనుచరులతో కలిసి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. జగ్గిరెడ్డి అరెస్టును నిరసిస్తూ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.