జర్నలిస్టు హత్యకు నిరసనగా రావులపాలెంలో ఆందోళన

7చూసినవారు
చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్య, ప్రజాశక్తి విలేకరి సుబ్రహ్మణ్యంపై దాడిని నిరసిస్తూ ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రావులపాలెం సీఐ శేఖర్ బాబుకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేఏ కన్వీనర్ బంగార్రాజు, జిల్లా కార్యదర్శి వాకాడ బాబులు, పల్నాటి ప్రసాద్ కుమార్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్