రావులపాలెం: పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎస్పీ

2చూసినవారు
బుధవారం రావులపాలెంలో నూతనంగా నిర్మించిన అర్బన్ పోలీస్ స్టేషన్‌ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కీలకమని కొనియాడారు. స్టేషన్ నిర్మాణానికి కృషి చేసిన తాడి నాగమోహన్ రెడ్డిని ఆయన అభినందించారు. అనంతరం డీఎస్పీ సుంకర మురళీమోహన్ తో కలిసి సీఆర్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కూడా ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్