కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కోనసీమ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డిని పోలీసులు విడుదల చేశారు. రావులపాలెం మండలం రావులపాలెం-వేదిరేశ్వరం రోడ్డులో విగ్రహం ఏర్పాటు వివాదం నేపథ్యంలో బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్న ఆయనను, వైసీపీ శ్రేణులు స్టేషన్ వద్దకు భారీగా చేరుకోవడంతో చర్చల అనంతరం వదిలిపెట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.