ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రంలో శుక్రవారం శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివార్ల కళ్యాణం కనుల పండువగా సాగింది. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరించారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక ప్రజలు, భక్తుల కోలాహలంతో వాడపల్లి పుణ్యక్షేత్రం శివనామస్మరణతో మారుమోగింది.