వాడపల్లిలో తిరునక్షత్ర ఉత్సవం

6చూసినవారు
ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం గీతా జయంతి సందర్భంగా భగవద్గీత పారాయణం జరిగింది. కాకినాడకు చెందిన కృష్ణ పరివార్ సంఘం సభ్యులు, రావులపాలెం మహిళలు ఈ పారాయణంలో పాల్గొన్నారు. అలాగే, ఆళ్వారుల సన్నిధిలో తిరుమంగై ఆళ్వారుల తిరునక్షత్ర ఉత్సవాలు రెండు రోజులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్రవిడ వేదపారాయణం, నీరాజన మంత్రపుష్పం, పల్లకీ సేవ వంటి కార్యక్రమాలను అర్చకులు వైభవంగా జరిపించారు.

ట్యాగ్స్ :