ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బుధవారం రాత్రి వేద పండితుల సమక్షంలో ఘనంగా జ్వాలతోరణం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న భక్తులకు నరగోష, దృష్టి దోషాలు, శత్రుబాధలు తొలగుతాయని పండితులు తెలిపారు. ఆలయాల్లో స్తంభాలకు గడ్డితో తోరణాలు కట్టి, నూనెలో ముంచిన వస్త్రాలను తగిలించి వెలిగించి, వాటి చుట్టూ ఉత్సవ విగ్రహాన్ని మూడుసార్లు తిప్పుతూ శివుణ్ణి స్మరించుకుంటారు.