ఆదివారం, ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన గండూరి కుమార్ శివ శరత్ మరియు కుటుంబ సభ్యులు ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారికి సుమారు రూ. 5,00,000/- విలువైన బంగారు మంగళ సూత్రాలు, బంగారు చైన్‌ను భారీ విరాళంగా సమర్పించారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. భక్తుల విరాళాలతో వాడపల్లి క్షేత్రం మరింత శోభాయమానంగా మారుతోందని ఆలయ వర్గాలు తెలిపాయి.