వానపల్లి: మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు

1687చూసినవారు
కొత్తపేట మండలంలోని వానపల్లి శివారు నక్కావారి కాలనీ వాసులు మౌలిక సదుపాయాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం వారు మాట్లాడుతూ, కాలనీలో సరైన రహదారి, తాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో మరింత కష్టాలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తాగునీటి కోసం పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్