కొత్తపేట మండలం అవిడి గ్రామంలో చిన్నమ్మతో వాగ్వాదం కారణంగా మనస్తాపానికి గురైన అడపా విజయ (21) శనివారం రాత్రి ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆదివారం తెల్లవారుజామున గుండె నొప్పి రావడంతో సీపీఆర్ చేసిన బ్రతకలేదు. కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని, ఓ నర్సు దురుసుగా మాట్లాడిందని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద నిరసన తెలిపారు. సూపరింటెండెంట్, పోలీసులు వచ్చి నర్సును విధుల నుంచి తప్పిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. కాగా ఆ యువతికి ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది.