కొవ్వూరు - Kovvuru

చాగల్లు మండల పరిషత్ ఎంపిపి, జడ్పిసి రిజర్వేషన్ లు ప్రకటన

చాగల్లు మండల పరిషత్ ఎంపిపి, జడ్పిసి రిజర్వేషన్ లు ప్రకటన

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం చాగల్లు మండల పరిషత్ బిసి మహిళకు రిజర్వ్ చేసినట్లు ప్రకటన వెలువడింది. అలాగే చాగల్లు మండలం జడ్పీటీసీ షెడ్యూల్ కాస్ట్ కి రిజర్వ్ అయినట్లు ప్రకటనలు వెలువడింది. దీంతో మండలంలోని ప్రధాని పార్టీ అయినటువంటి తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి పార్టీలు ఇతర పార్టీలు తమతమ అభ్యర్థుల కొరకు అన్వేషణ ప్రారంభించింది. రిజర్వేషన్ ఖరారు కావడంతో మండలంలో ఒక్కసారిగా ఊహించిన విధంగా కాకుండా వేరే విధంగా రిజర్వేషన్లు స్థానాలు ప్రకటన రావడంతో ఒక్కసారిగా పార్టీ నాయకులు ఉలిక్కిపడి ఎన్నికల సమరానికి శ్రీకారం చుడుతున్నారు.

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా
TG: ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు ఇకపై సెలవుల్లేవ్!
Oct 16, 2026, 02:10 IST/

TG: ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు ఇకపై సెలవుల్లేవ్!

Oct 16, 2026, 02:10 IST
తెలంగాణ ఆర్టీసీలో డబుల్ డ్యూటీ చేసే డ్రైవర్లు, కండక్టర్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ నెల 13న ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఇకపై డబుల్ డ్యూటీ చేసే సిబ్బందికి డబుల్ డ్యూటీ అడ్వాన్స్ మాత్రమే చెల్లించాలి, సెలవులకు సంబంధించిన డీఆఫ్, సీఎఫ్‌లను మంజూరు చేయకూడదని పేర్కొంది. డబుల్ డ్యూటీకి బదులుగా సెలవులు ఇవ్వడంతో షెడ్యూల్ సర్వీసుల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆర్టీసీ పేర్కొంది. ఈ ఆదేశాలపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.