కొవ్వూరు గ్రామం ఇండియా టోల్గేట్ సమీపంలో ఆదివారం రాత్రి 172 కిలోల గంజాయిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డొంకరాయి ఆటోలో గంజాయిని తరలించి కంటైనర్ లారీలో లోడ్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో లారీ, ఆటోతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా అధికారి సీహెచ్ లావణ్య తెలిపారు. కొవ్వూరు సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు ఈ దాడుల్లో పాల్గొన్నారు.