తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో, "జలధార, జలహారతి" పథకం కింద భూగర్భ జలాలను పెంచే లక్ష్యంతో చాగల్లు మండలంలోని 11 గ్రామాలలో 34 పనులు గుర్తించారు. ఈ పనులన్నీ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్నారు. ఇప్పటికే 34 పనులకు పరిపాలనా ఆమోదం లభించింది. వీటిలో ఫీల్డ్ చానల్, ఫీడర్ చానల్, మరియు చెరువుల పూడికతీత పనులు ఉన్నాయి. ప్రస్తుతం 20 కాలువ పనులు జరుగుతుండగా, మిగిలిన 2 చెరువుల పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీ దేవి శ్రావణి పాల్గొన్నారు.