కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం చాగల్లు ఎంపీడీవో కార్యాలయం వద్ద 'స్వచ్ఛ రథం' వాహనాన్ని ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలనే లక్ష్యంతో ఈ వాహనాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు తమ వద్ద ఉన్న ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను స్వచ్ఛ రథం వద్ద ఇచ్చి నిత్యవసర సరుకులు పొందాలని సూచించారు.