బుధవారం చాగల్లు గ్రామంలో ఐదో విడత రీ సర్వే పనులను ఏడీ సర్వే & ఇతర అధికారులతో కలిసి జేసీ వై. మేఘా స్వరూప్ తనిఖీ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, నిర్ణీత సమయంలో సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను క్షేత్ర స్థాయిలోనే వేగంగా పరిష్కరించేలా అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పౌర సేవలు అందించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, భూ సర్వే వాటికి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని తెలియజేశారు.