సీఎం సహాయ నిధి - నిరుపేదల వైద్య చికిత్సకి ఆర్థిక భరోసా

4చూసినవారు
కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో, కొవ్వూరు పట్టణానికి చెందిన ఆరుగురు సభ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ. 1,84,114/-ల విలువైన చెక్కులను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదివారం అందజేశారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పేదలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందని, ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్