పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి: ఎమ్మెల్యే ముప్పిడి

8చూసినవారు
ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 4 వార్డుల్లో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులలో పారిశుధ్య పరిస్థితులను స్వయంగా పరిశీలించి, రోడ్ల పక్కన ఉన్న డ్రైన్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. రహదారులపై ఉన్న డంపులను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :