తూర్పుగోదావరి జిల్లాలో డీజిల్ కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట కోతల సమయంలో ట్రాక్టర్లకు డీజిల్ అందక, పొలాలు దున్నడానికి, ధాన్యం రైస్ మిల్లులకు తరలించడానికి ఆటంకాలు ఎదురవుతున్నాయని రైతు కన్వీనర్ గారపాటి వెంకట సుబ్బారావు తెలిపారు. చాగల్లు మండలంలో నాలుగు డీజిల్ బంకులను వీఆర్ఓ పర్యవేక్షిస్తున్నారని తాసిల్దార్ ఎం. మేరీకమ్మ వివరించారు. ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి డీజిల్ సరఫరాకు చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.