మొంథా తుఫాను కారణంగా వాయిదా పడిన గోదావరి హారతి కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఏటా కార్తీక మాసంలో నిర్వహించే ఈ కార్యక్రమం, గత నెల 27న జరగాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ కార్యక్రమం కోసం టీటీడీ నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తున్నట్లు ఆయన వివరించారు.