కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఈ నెల 27వ తేదీన జరగాల్సిన గోదావరి హారతి కార్యక్రమాన్ని భారీ వర్షాల కారణంగా వాయిదా వేసినట్లు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం సాయంత్రం ప్రకటించారు. వాతావరణం సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు.