ఇంటర్ పరీక్షలు ప్రశాంతం: నలుగురు విద్యార్థులు గైర్హాజరు

1చూసినవారు
ఇంటర్ పరీక్షలు ప్రశాంతం: నలుగురు విద్యార్థులు గైర్హాజరు
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం చాగల్లులోని ఎస్వీ ఆర్ కే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బుధవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం గణితం, సివిక్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రిన్సిపాల్ కే పావని తెలిపిన వివరాల ప్రకారం, పరీక్షలకు మొత్తం 101 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 97 మంది హాజరయ్యారు. నలుగురు విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని తనిఖీ అధికారులు ఎవరూ సందర్శించలేదని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్