
మరో వ్యక్తి గొంతు కోసిన చైనా మాంజా (వీడియో)
TG: చైనా మాంజా ప్రాణాంతకంగా మారుతోంది. హైదరాబాద్ అంబర్పేట కొత్త ఫ్లైఓవర్ మీద బైక్పై గోల్నాక నుండి రామంతపూర్ వైపు వెళ్తుండగా ఓ వ్యక్తి మెడకు చైనా మాంజా తగిలి కోసుకుపోయింది. తీవ్ర రక్తస్రావం అవ్వడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మనుషుల ప్రాణాలు తీస్తున్న చైనా మాంజాను వాడడం ఇకనైనా ఆపాలని పోలీసులు కోరుతున్నారు.




