మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పలు కీలక విషయాలపై చర్చలు జరిగాయి. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో పాటు, ద్విసభ్య కమిటీ సభ్యులైన జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, మద్దిపట్ల శివరామ కృష్ణ, ఆళ్ళ హరిబాబు, నాదేళ్ళ శ్రీరామ్, సూరపని చిన్ని తదితరులు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.