
భర్తను కిడ్నాప్ చేయాలని చూసిన మహిళ అరెస్ట్
తన భర్త శ్యామ్‌ను కిడ్నాప్ చేయాలని కుట్ర పన్నిన ఆరోపణలపై పోలీసులు మంగళవారం మాధవీలత అనే మహిళతో పాటు 9 మందిని అరెస్టు చేశారు. 3ఏళ్ల క్రితం విడిపోయిన మాధవీలత, ఇటీవల రూ. 20 కోట్లకు పూర్వీకుల ఆస్తిని విక్రయించిన భర్త ఆస్తులను లాక్కోవడానికి ఈ ప్లాన్ వేసినట్లు సమాచారం. కిడ్నాపర్ల చెర నుంచి బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అరెస్టయిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.




