రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం టిడిపి పార్టీ ఉపాధ్యక్షులు ఆళ్ల హరిబాబుకు నూతన సంవత్సర సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అభిమానులు, ఆత్మీయులు అధిక సంఖ్యలో శుభాకాంక్షలు తెలియజేశారు. చాగల్లు మండలం చాగల్లు నివాస గృహంలో కేక్ కట్ చేసి తినిపించారు. తాహశిల్దార్ ఎం మెరికమ్మ, మండల పరిషత్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నియోజకవర్గంలోని టిడిపి కార్యకర్తలు, నాయకులు, జర్నలిస్టులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొవ్వూరు ఏఎంసి చైర్మన్ నాదెండ్ల శ్రీ రామ్ చౌదరి నానికి యూత్ ఆధ్వర్యంలో కూడా నూతన సంవత్సర వేడుకలు భారీగా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ చాగల్లు మండల అధ్యక్షులు వనజర్ల వెంకట్రావు, వేండ్ర శ్రీనివాసరావు, లయన్స్ జోన్ చైర్మన్, చాగల్లు మండల ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోడి నాగేశ్వరరావు వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.