కొవ్వూరులో ఇసుక లారీ బోల్తా, పెను ప్రమాదం తప్పింది

1950చూసినవారు
కొవ్వూరు పట్టణంలో ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆరికరేవుల గట్టుమీద ఉన్న ఓపెన్ రీచ్ ల ద్వారా తరలిస్తున్న ఇసుక లారీ, కొవ్వూరు గోదావరి మాత విగ్రహం వద్ద లారీ యాక్సిల్ విరిగిపోయి ఒక పక్కకి ఒరిగిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఇక్కడ ఏర్పడిన పెద్ద గోతుల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని పూడ్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్