అసాంఘిక శక్తులపై తాళ్ళపూడి పోలీసులు ఉక్కుపాదం

5చూసినవారు
అసాంఘిక శక్తులపై తాళ్ళపూడి పోలీసులు ఉక్కుపాదం
తాళ్ళపూడి మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తాళ్ళపూడి ఎస్.ఐ. టి. రామకృష్ణ హెచ్చరించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, శనివారం సాయంత్రం పోలీసులు గ్రామ శివారు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. నిఘాకు వీలుకాని గోదావరి పరిసరాలు, పొదలు, తోటలు, నిర్మానుష్య ప్రాంతాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలను గుర్తించడానికి అత్యాధునిక డ్రోన్ కెమెరాలను ఉపయోగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్