చాగల్లు నెలటూరు లయన్స్ క్లబ్ సభ్యులు, టీడీపీ నాయకుడు లయన్ పొట్రు సిద్ధార్థ శంకర్ (సిద్దు) పుట్టినరోజు సందర్భంగా కొవ్వూరు మండలం పంగిడిలోని ఆయన నివాసంలో అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో 53 కేజీల కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులకు, పేదలకు చలికాలంలో రక్షణ కోసం 53 దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేగి చినచిన్నా, లయన్స్ నాయకులు కోడి నాగేశ్వరరావు, వల్లిపల్లి వెంకట రామారావు, కోట నాగేశ్వరరావు పాల్గొన్నారు. లయన్ అధ్యక్షులు రామారావు మాస్టారు, జోన్ ఛైర్మన్ కోడి నాగేశ్వరరావు, ట్రెజరర్ కోట నాగేశ్వర రావు కూడా పాల్గొని సిద్ధార్థ శంకర్ కు శుభాకాంక్షలు తెలిపారు.