తల్లీకూతుళ్ల మృతదేహాలు కలకలం

9చూసినవారు
తల్లీకూతుళ్ల మృతదేహాలు కలకలం
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమడు గ్రామ శివారులో తల్లీకూతుళ్ల మృతదేహాలు కలకలం రేపాయి. దూబచర్ల-చేబ్రోలు మార్గంలోని జీడిమామిడి తోటలో మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన వీరిద్దరిలో ఒకరి తలకు బలమైన గాయమైనట్లు తెలుస్తోంది. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి, ఇది హత్యేనా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్