పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం భక్త జనసంద్రమైంది. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు, కార్తీక దీపారాధనలు చేసి నదిలో దీపాలు వదిలారు. స్నానఘట్టంలోని శివలింగానికి అభిషేకాలు నిర్వహించి, అనంతరం క్షేత్రంలోని సుందరేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.