తాళ్లపూడి మండలం మలకపల్లి, పెద్దేవం గ్రామాల్లో సోమవారం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగానే ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టుమెన్ కమిటీ సభ్యులు, AMC చైర్మన్, NDA కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు.