యర్నగూడెం: ఆకాశాన్నoటిన కూరగాయల ధరలు

75చూసినవారు
యర్నగూడెం: ఆకాశాన్నoటిన కూరగాయల ధరలు
దేవరపల్లి మండలం యర్నగూడెం వారాంతపు సంతలో కూరగాయల ధరలు అధికంగా ఉండి ఆకాశాన్నంటాయి. సోమవారం వారాంతపు సంతలో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చి అమాంతం రేట్లు రెండింతలయ్యాయి. కేజీ టమోటా రూ. 35, బెండకాయలు రూ. 50, దొండకాయలు రూ. 40, వంకాయలు రూ. 60, దోసకాయలు రూ. 20, పచ్చిమిర్చి కిలో రూ. 80, కాగా ములక్కాడ ఒకటీ రూ. 30, అల్లo రూ. 60, కొత్తిమీర కట్ట 20 గా ఉంది. దీంతో ధరలు అధికంగా ఉన్నాయని వినియోగదారులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్