
ఏడిద: 20 వేల పిడకలతో భారీ భోగి దండ
మండపేట పరిధిలోని ఏడిదకు చెందిన గొడవర్తి సాయి భారతి, సంస్కృతి పరిరక్షణ ధ్యేయంతో 20వేల భోగి పిడకలతో ఒక భారీ దండను సిద్ధం చేశారు. గత మూడేళ్లుగా తన కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె సోమవారం తెలిపారు. భోగి రోజున ఈ భారీ దండను ఊరేగింపుగా తీసుకువెళ్లి భోగిమంటల్లో వేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.




































