ద్వారపూడిలో గురువారం జరిగిన సూర్య ప్రకాశ్ రావు హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. నిందితులు అయినవిల్లి సంధ్య అన్నదమ్ములు, సూర్య ప్రకాశ్ రావును రాళ్లతో తలపై కొట్టి కిరాతకంగా చంపిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడ్డాయి. శనివారం పోలీసులు ఈ దృశ్యాలను విశ్లేషించి దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.