రాయవరంలో డీజిల్ కష్టాలు: నిలిచిపోయిన కోత యంత్రాలు

0చూసినవారు
రాయవరం మండలంలో డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచే రైతులు ఆరు బంకుల వద్ద క్యూ కట్టారు. వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఇంధనం అందక కోత యంత్రాలు పొలాల్లోనే ఆగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంకులకు వస్తున్న పరిమిత లోడ్ సరిపోవడం లేదని, అధికారులు స్పందించి ఇంధన సరఫరాను క్రమబద్ధీకరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్