ద్వారపూడి మాజీ సర్పంచ్ తులా రంగారావు కన్నుమూత

2చూసినవారు
ద్వారపూడి మాజీ సర్పంచ్ తులా రంగారావు కన్నుమూత
ద్వారపూడి మాజీ సర్పంచ్, మార్కెట్ కమిటీ తొలి ఛైర్మన్, మాజీ జెడ్పీటీసీ తులా రంగారావు (82) బుధవారం తుదిశ్వాస విడిచారు. ద్వారపూడి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సాధనతో పాటు గ్రామాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలలో సుదీర్ఘకాలం క్రియాశీలకంగా పనిచేసిన ఆయనకు జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్ అల్లుడు. రంగారావు మృతిపై ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి తదితరులు తీవ్ర సంతాపం తెలిపారు.

ట్యాగ్స్ :