మొంథా తుఫాన్ ప్రభావంతో కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం నేలటూరులో అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో తలదాచుకున్న పేదలకు శుక్రవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తుఫాన్ల వంటి విపత్కర పరిస్థితులలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత సాంకేతికతను వినియోగించుకుని, అపార నష్టం, ప్రాణ నష్టం కలగకుండా ముందు చూపుతో ఆలోచించారని కొనియాడారు.