ద్వారపూడిలో నవ వరుడు సూర్య ప్రకాశరావు హత్య స్థానికంగా కలకలం రేపింది. అన్నవరంలో వివాహం ముగించుకుని భార్య సంధ్యతో కలిసి బైక్‌పై ఇంటికి వస్తుండగా, మార్గమధ్యలో మాటువేసిన దుండగులు దాడి చేసి ప్రకాశరావును బండరాయితో ముఖంపై కొట్టి చంపారు. భార్య సంధ్య ఆర్తనాదాలు చేసినా నిందితులు కనికరించలేదు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.